![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1004 లో.. బోర్డాఫ్ డైరెక్టర్ లో ఒకరిగా ఉండాలని మను అనుకొని.. తనకంటూ ఒక క్యాబిన్ ని రెడీ చేయించుకుంటాడు. ఆ విషయం వసుధారకి తెలిసి.. నా కాలేజీలో నాకు తెలియకుండా క్యాబిన్ ఏర్పాటు చేయడమేంటని వసుధార కోపంగా ఉంటుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. దానికి మినిస్టర్ గారు కూడా వస్తారు. మను బోర్డు మెంబర్ గా ఉంటాడంట.. తను కాలేజీకి బాగా హెల్ప్ చేసాడు. నాకు మను బోర్డు మెంబర్ గా ఉండడం ఇష్టమేనని మినిస్టర్ అంటాడు.
ఆ తర్వాత ఈ కాలేజీ బాగు కొసమే ఉండాలి అనుకుంటున్నాను. కాలేజీని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళ సంగతి చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని మను అంటాడు. శైలంద్ర గురించి మనుకి తెలిసినట్లుంది.. అందుకే మను అలా అంటున్నాడని మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఓక హెల్ప్ చేసిన్నందుకు నిన్ను బోర్డు మెంబర్ ని చేసుకోవాలా అని శైలంద్ర అంటాడు. మరి నువ్వు యాబై కోట్లు ఇస్తావా? యాభై రూపాయలు కూడా ఉండవని శైలేంద్రని ఫణింద్ర అంటాడు. నువ్వు మా కాలేజీని కాపాడావ్ నువ్వు బోర్డు మెంబర్ గా ఉండడం నాకు ఇష్టమే అని ఫణింద్ర అంటాడు. మీరెందుకు ఒప్పుకున్నారు.. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆపాలని వసుధార తన మనసులో అనుకుంటుంది. నువ్వేం అంటావ్ మహేంద్ర అని ఫణింద్ర అడుగుతాడు. నాకు ఇస్టమేనని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఇక ఎండీ నిర్ణయమని వసుధారని అడుగుతారు. దాంతో మీ ఇష్టమని వసుధార చెప్పగానే శైలంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత వర్క్ ఉందంటు వసుధార తన క్యాబిన్ కి వెళ్ళిపోతుంది.
.webp)
ఆ తర్వాత మను దగ్గరికి శైలంద్ర వచ్చి ఆర్గుమెంట్ చేస్తాడు. నాకు అడ్డుపడిన వాళ్లని అందరిని లేపేశానని శైలంద్ర అంటాడు. అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావని మనుని శైలేంద్ర అడుగుతాడు. చెప్పాను కదా కొందరి నుండి కాలేజీని కాపాడాలని ఇలా చేస్తున్నానని మను చెప్తాడు. నీకు ఎండీ చైర్ కావాలా? లేక వసుధార కావాలా అని శైలెంద్ర అనగానే.. శైలెంద్రపైకి చెయ్ లేపుతాడు మను. అదంతా అనుపమ చూస్తుంటుంది. ఆ తర్వాత మను వెళ్తుంటే అనుపమ వచ్చి.. ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. కాసేపటికి వసుధార దగ్గరికి మను వెళ్తాడు. అతనితో వసుధార ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది. మరొకవైపు శైలెంద్ర ఫ్రస్ట్రేషన్ తో బెల్ట్ తో తనని తాను కొట్టుకుంటుంటాడు. అప్పుడు దేవయాని వచ్చి శైలేంద్రని ఆపుతుంది. నువ్వు కూడా నా కోపం తగ్గలంటే నన్ను కొట్టని దేవాయనిని బలవంతం చేస్తే తను కొడుతుంది. అప్పుడే ధరణి వచ్చి మా అయనని ఎందుకు కొడుతున్నావని దేవాయని అడుగుతుంది. నేనే కొట్టమన్న అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |